: కీలక పాత్ర పోషిస్తాడు కానీ...గొప్ప ఆటగాడు కాదు: కౌంటి కోచ్


శ్రీలంకకు ప్రపంచ కప్ టీ20 అందించిన కుమార సంగక్కర గొప్ప ఆటగాడు కాదంటూ కౌంటీ జట్టు కోచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ లోని డర్హమ్ కౌంటీ జట్టుకు సంగక్కర ప్రాతినిథ్యం వహించనున్నాడన్న వార్తల నేపధ్యంలో కోచ్ జాన్ లూయిస్ మాట్లాడుతూ, సంగక్క డర్హమ్ జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అన్నారు. అయితే సంగక్కర ప్రపంచ క్రికెట్ లో చెప్పుకోదగ్గ ఆటగాడు కాదని తేల్చేశారు.

కాగా డర్హమ్ జట్టు యాజమాన్యం సంగక్కర ప్రాతినిథ్యంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. 2007లో వార్విక్ షైర్, 2010లో లాంక్ షైర్ జట్లకు సంగక్కర సంతకం చేసినా ఆడలేదు. ఇప్పుడు అది పునరావృతం కాకుండా యాజమాన్యం జాగ్రత్త వహిస్తోంది.

  • Loading...

More Telugu News