: టీడీపీ గెలుపు చారిత్రక అవసరం: చంద్రబాబు
సీమాంధ్రలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో బాబు ప్రసంగిస్తూ, తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరమని చెప్పారు. నిజాయతీ పరుడికే ఓటు వేసే బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అవినీతి కేసులు లేవని, తానెవరికీ భయపడాల్సిన అవసరం లేదనీ అన్నారు. వైఎస్ హయాంలో తనపై చాలా విచారణ కమిటీలు వేశారన్న బాబు, నిజాయతీగా ఉండబట్టే తననేమీ చేయలేకపోయారన్నారు. ఆదివాసీలను ఆదుకునే బాధ్యత టీడీపీదేనన్నారు.