: త్వరలో విశ్వరూపం-2: కమల్


మొత్తానికి కమల్ హాసన్ ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో ఇష్టపడి కష్టపడి తీసిన 'విశ్వరూపం' చిత్రం ఈ రోజు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 600 థియేటర్లలో విడుదల అయింది. ఎక్కడా ఎలాంటి అవాంతరం లేకుండా సినిమా విడుదల కావడం పట్ల కమల్ సంతోషం వ్యక్తం చేసారు. తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నానని అన్నారు.

ఈ సందర్భంగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్పారు. త్వరలోనే విశ్వరూపం-2 చిత్రాన్ని నిర్మిస్తానని అభిమానులకు శుభవార్త చెప్పారు.
మరోవైపు వివాదాల అనంతరం విడుదల అయిన విశ్వరూపం సినిమాను చూసేందుకు తమిళనాడు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెల 13 వరకూ టికెట్లు ఈ రోజే అమ్ముడు పోయాయి.

  • Loading...

More Telugu News