: సోనియాను బలిదేవత అన్న కేసీఆర్ కు శ్రవణ్ సూటి ప్రశ్న


కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాల పదును పెంచారు. కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీఎం పదవి కోసం సోనియా కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. సోనియా బలి దేవత అయితే కుటుంబ సభ్యులందరితో కలిసి ఆమెను ఎందుకు కలిశారని ఆయన నిలదీశారు. కేసీఆర్ ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News