: బీజేపీ స్థానాల్లో నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు
టీడీపీ, బీజేపీల పొత్తు బీటలు వారుతున్నట్లు కనపడుతోంది. బీజేపీకి కేటాయించిన స్థానాల్లో బలహీన అభ్యర్థులను నిలబెట్టారని ఇప్పటికే టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి కేటాయించిన మదనపల్లి, సంతనూతలపాడు, రాజమండ్రి సిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రాజమండ్రి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మదనపల్లి స్థానానికి దొమ్మలపాటి రమేష్, రాందాస్ చౌదరి, వలిగట్ల రెడ్డప్పలు నామినేషన్ వేశారు. అలాగే సంతనూతలపాడు స్థానంలో విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.