: కుప్పంలో లోకేష్ కు బ్రహ్మరథం
చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేసేందుకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి లోకేష్ చేరుకున్నారు. నామినేషన్ దాఖలుకు భారీ ర్యాలీగా ఆయన బయల్దేరారు. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ ర్యాలీకి తరలివచ్చారు. పచ్చ జెండాలు, తోరణాలతో కుప్పం పసుపుమయమైంది. లోకేష్ కు అడుగడుగునా కార్యకర్తలు పూల జల్లులతో స్వాగతం పలికారు.