: విభేదాలున్నా టీడీపీ,బీజేపీ పొత్తు బలమైంది: ప్రకాశ్ జవదేకర్
అభ్యర్థుల ఎంపికలో టీడీపీ, బీజేపీలో విభేదాలు ఉన్నప్పటికీ పొత్తు మాత్రం బలమైనదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పూణెలో మాట్లాడిన జవదేకర్, కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పొత్తు నేపథ్యంలో పోటీకి దింపిన పార్టీ అభ్యర్థులపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో జవదేకర్ హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే.