: విశాఖ అరకు లోయలో ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు
విశాఖపట్నం జిల్లా అరకులోయలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నామినేషన్ వేసేందుకు వెళ్లిన కిశోర్ చంద్రదేవ్ వాహనంపై గంగాధర్ వర్గీయులు దాడి చేశారు. అడ్డుకోబోయిన పోలీసుల పైనా వాళ్లు దాడికి దిగడంతో ఓ ఎస్సైకు గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. అక్కడి పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.