: చిన్నారులు బోర్ వెల్ లో పడితే ఈ రోబో కాపాడుతుంది


బోరు బావుల్లో చిన్నారులు పడిపోయి ప్రాణాలు కోల్పోయే ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. పొలాల్లో నీటి కోసం బోర్లు తవ్వినప్పుడు, నీరు పడకపోతే వాటిని ఖాళీగా వదిలేస్తుంటారు. చిన్నారులు తెలియక అటుగా వెళ్లి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో లోపల ఎక్కడో ఉన్న చిన్నారులకు ప్రాణవాయువు అందిస్తూ చుట్టూ మట్టి తవ్వి బయటకు తీసేసరికి వారు జీవించి ఉండడం చాలా కష్టం. ఇలాంటి సమయాల్లో ప్రాణాలు రక్షించే సంజీవని లాంటి రోబో పరికరాన్ని తమిళనాడులోని మధురైకి చెందిన సామాజిక సేవకుడు మణిగంధన్, అతడి స్నేహితులు కలసి తయారు చేశారు.

వారు తయారు చేసిన రోబో ఇటీవలే ఓ మూడేళ్ల చిన్నారిని బోరు బావి నుంచి కాపాడింది. ఎక్కడైనా బోరు బావిలో చిన్నారి పడిపోయాడంటే వీరి బృందం వెళ్లి కాపాడే పనిని చేపడుతుంది. మణిగంధన్ కొడుకు 2003లో బోరుబావిలో చిక్కుకుపోయాడు. అప్పుడు అతడిని రక్షించడానికి పడిన ప్రయాసే రోబో తయారు చేయడానికి అతడిని ప్రోత్సహించింది. ఐరన్ తో చేసిన ఈ రోబో రెండు అడుగుల ఎత్తు ఉంటుంది. బరువు 5 కేజీలు. దీనిలో చీకట్లోనూ చూడగల కెమెరా ఉంటుంది. 50 కేజీల బరువును మోయగలదు. తాడు సాయంతో దీన్ని లోపలకు పంపిస్తే చాలు పని చక్కబెట్టేస్తుంది.

  • Loading...

More Telugu News