: కేసీఆర్... రాజకీయాల్లోంచి తప్పుకో: రాములమ్మ
కేసీఆర్ రాజకీయాల్లోంచి తప్పుకోవాలని మెదక్ ఎంపీ విజయశాంతి సూచించారు. మెదక్ లో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం కేసీఆర్ నైజమన్న రాములమ్మ, ఆయన రాజకీయాల్లోంచి రిటైర్ కావాలని డిమాండ్ చేశారు. మెదక్ ఎంపీగా ప్రజాసంక్షేమానికి తాను చేపట్టిన పనులను టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. వీధి దీపాలు, నీటి మోటార్లకు కేటాయించిన నిధులను నేతలు దుర్వినియోగం చేశారని ఆమె మండిపడ్డారు. నిన్న కాక మొన్న పుట్టిన టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్ని తానే నడిపించాననడం విడ్డూరమని ఆమె ఎద్దేవా చేశారు.