: కేజ్రీవాల్ ఒక్క ట్వీట్ తో రూ.80లక్షలు


వారణాసి, అమేధీలో ఎన్నికల ప్రచారం కోసం స్వచ్చమైన నిధులను అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ట్విట్టర్లో ఒక్క ట్వీట్ చేశారు. అంతే, 24 గంటల్లోనే ప్రపంచం నలుమూలల నుంచి 80లక్షల రూపాయలు విరాళాలుగా ఆమ్ ఆద్మీకి వచ్చాయి. అందులో 16 లక్షలు యూపీ నుంచే వసూలు అయ్యాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున నిధుల అవసరం ఉండడంతో ఆమ్ ఆద్మీ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విరాళాలను అభ్యర్థిస్తున్నారు.

  • Loading...

More Telugu News