: 'గూగుల్' శోధనలో పవన్ ముందంజ


హీరోయిజం కంటే పవనిజమే పరమావధిగా అభిమానులు భావించేటంతగా పాప్యులర్ అయిన నటుడు పవన్ కల్యాణ్ ఇటీవల 'జనసేన' పేరుతో పార్టీ స్థాపించి దేశ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక నుంచి ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, భవిష్యత్తు కార్యకలాపాలు ఎలా ఉంటాయనే దానిపై నిరంతరం సెర్చ్ ఇంజిన్ గూగుల్లో నెటిజన్లు వెతుకులాట మొదలు పెట్టారట. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సెలబ్రిటీ అభ్యర్థుల్లో పవనే ముందంజలో ఉన్నారని ఈ సంస్థ తెలిపింది.

ప్రస్తుతం జరగనున్న 16వ లోక్ సభ ఎన్నికల్లో పలువురు నటులు పోటీ చేస్తున్నారు. వారంతా ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని గూగుల్ పేర్కొంది. తొలిసారి పోటీ చేస్తున్న నటి నగ్మా, సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కంటే మిన్నగా తన హవా చూపుతోందట. అటు ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ కూడా రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి నెటిజన్లను బాగానే ఆకర్షిస్తూ ఏడవ ర్యాంక్ లో ఉందట.

వీరుకాక నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి, హిందీ కమెడియన్ రాజు శ్రీవాత్సవ, భోజ్ పురి నటుడు మనోజ్ తివారీ, ఏఏపీ తరపున పోటీ చేస్తున్న గుల్ పనాగ్, బీజేపీ నుంచి బరిలో దిగిన నటుడు అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్, జయప్రద తదితరులు గూగుల్లో శోధన చేస్తున్న నటుల జాబితాలో ఉన్నారు.

  • Loading...

More Telugu News