: సచిన్ మళ్లీ బ్యాటు పట్టాడు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాటు పట్టాడు. అరగంట సేపు బ్యాటింగ్ చేసిన దిగ్గజం తనలో వాడి తగ్గలేదని చూపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత అంతర్జాతీయ టోర్నీల్లో కనిపించని క్రికెట్ దిగ్గజం తాజాగా ఐపీఎల్ లో జరుగుతున్న దుబాయ్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో సందడి చేశాడు. ఆలస్యంగా ముంబై ఇండియన్స్ బస చేస్తున్న హోటల్ కు చేరుకున్న సచిన్ తెల్లవారు జామున ముంబై జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు.
ముంబై ఇండియన్స్ జట్టు సచిన్ ను దిగ్గజ ఆటగాడిగా ప్రకటించడంతో సచిన్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. జట్టు సహాయక సిబ్బందితో త్రోలు వేయించుకుని అరగంట బ్యాటింగ్ చేశాడు. తరువాత పొలార్డ్, రోహిత్ శర్మల బ్యాటింగ్ విధానం గమనించి వారికి సలహాలు ఇచ్చాడు. కోచ్ జాన్ రైట్, కెప్టెన్ రోహిత్ శర్మ తో ప్రణాళికలగురించి చర్చించాడు. కుంబ్లేతో సుదీర్ఘంగా చర్చించిన సచిన్ మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకుని గోల్ఫ్ కోర్సుకు వెళ్లారు.