: ధోనీని బంధించిన షారూఖ్ ఖాన్


ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో షారూఖ్ ఖాన్ టీమిండియా కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీని ఆటపట్టించాడు. ధోనీ హెలికాప్టర్ షాట్ తన నుంచి లాగేసుకున్నాడని ఆరోపించాడు. తాను సినిమాల్లో హెలికాప్టర్ నుంచి దిగుతానని అయితే దాని గురించి ఎవరూ మాట్లాడలేదని, అందరూ ధోనీ హెలికాప్టర్ షాట్ గురించే మాట్లాడుతారని చమత్కరించాడు. తరువాత మరో తమాషా జరిగింది. ధోనీ, షారూఖ్ ఇద్దరూ కుర్చీల్లో కూర్చోగా, వారిని సహాయకులు తాళ్లతో బంధించారు. ముందు ప్లాన్ ప్రకారం షారూఖ్ ఆ కట్లను తెలివిగా విడిపించుకోగా, ధోనీకి విప్పుకోవడం రాలేదు. ఆయనలా బందీగా ఉండగానే, ఐపీఎల్ జట్ల కెప్టెన్లు స్టేజి మీదికి వచ్చి దీపికా పదుకొనేతో లుంగీ డాన్స్ చేసి సందడి చేశారు. పాపం ... ధోనీ మాత్రం వారినలా చూస్తుండిపోయాడు!

  • Loading...

More Telugu News