: వారంతా జలసమాధి అయినట్లేనా?
దక్షిణ కొరియా తీరంలో ఓడ ప్రమాదం కారణంగా గల్లంతైన 287 మంది కోసం నేడు కూడా అన్వేషణ కొనసాగుతోంది. 475 మందితో వెళుతున్న ఓడ నిన్న తెల్లవారుజామున ప్రమాదంలో చిక్కుకుని క్రమంగా నీటిలో ముగినిపోయిన విషయం తెలిసిందే. దక్షిణ కొరియా తీరరక్షక దళం సిబ్బంది 179 మందిని కాపాడారు. 9 మంది మరణించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు నేడు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
ఓడలో ప్రయాణిస్తున్న వారిలో 375 మంది హైస్కూల్ విద్యార్థులు ఉన్నారు. టీచర్లతో కలసి ప్రముఖ పర్యాటక క్షేత్రం జేజుకు వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. ఆచూకీ లేకుండా పోయిన 287 మందిలో ఎవరూ జీవించి ఉండే అవకాశం లేదని తీరరక్షకదళం అధికారులు భావిస్తున్నారు. వారు మరణించినట్లు ధ్రువీకరిస్తే దక్షిణ కొరియా దేశంలో ఇదొక అతిపెద్ద ప్రమాదంగా నిలిచిపోతుంది.