: లోక్ సభకు పోటీ చేయలేనంటున్న మాజీ మంత్రి కాసు


పార్టీ కేటాయించిన నరసరావుపేట లోక్ సభ స్థానానికి పోటీ చేయలేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కాసు కృష్ణారెడ్డి వెల్లడించారు. ఇదే విషయాన్ని పీీసీసీకి చెప్పానన్నారు. ఒకవేళ కాదు అంటే అప్పుడే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మధ్యాహ్నం ఏఐసీసీ, పీసీసీకి తన నిర్ణయాన్ని తెలపనున్నట్లు ప్రకటించారు. సీమాంధ్రలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమకు కేటాయించిన అసెంబ్లీ స్థానాల నుంచి తప్పుకోగా కాసు ఇలా షాక్ ఇవ్వడం కాంగ్రెస్ ను విస్మయం పరిచే అంశం.

  • Loading...

More Telugu News