: బాలయ్య వివరాలు ఇవే... ఆయన ఆస్తి 500 కోట్ల పైమాటే


సినీ నటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలయ్య ఆస్తి 500 కోట్ల రూపాయల పైమాటేనని ఆయన తెలిపారు. నిన్న నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల కమీషన్ కు ఆయన వ్యక్తిగత వివరాలు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల చిట్టా విప్పారు. తనకు కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ కలిపి 500 కోట్లకు పైగా ఉన్నాయని అన్నాడు.

తన ఒక్కడి ఆస్తి 170 కోట్ల పై చిలుకు అని చెప్పిన బాలయ్య అందులో చరాస్థులు 144 కోట్ల రూపాయలని, స్థిరాస్తులు 30 కోట్ల రూపాయలని అన్నాడు. తాను నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశానని, తనపై ఏ విధమయిన కేసులు లేవని ఆయన తెలిపారు. తనకు నాలుగు కార్లు ఉన్నాయని, అందులో రెండు బీఎండబ్ల్యూ, ఒక ఆడి, ఒక స్కోడా కారు ఉన్నట్టు తెలిపాడు.

తన భార్య వసుంధర పేరిట 130 కోట్ల రూపాయలు ఉన్నాయని, అందులో 90 కోట్ల రూపాయలు చరాస్తుల రూపంలో, 30 కోట్ల రూపాయలు స్థిరాస్తుల రూపంలో ఉన్నాయని అన్నారు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞ పేరిట 20 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు. ఇక అప్పుల విషయానికి వస్తే 25 కోట్ల రూపాయలు వ్యక్తిగత అప్పులు ఉన్నాయని వెల్లడించారు. మరో రెండున్నర లక్షల రూపాయల వరకు ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బాకీలు ఉన్నాయని ఆయన ఈసీకి తెలిపారు.

  • Loading...

More Telugu News