: సినీ కెమెరా మెన్ 2 కోట్లు లేపేశాడు
తెలుగు సినీ పరిశ్రమలో మరో చిట్టీల మోసం వెలుగు చూసింది. సీరియల్ నటీమణి విజయరాణి పది కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి మర్చిపోకముందే, సినీ కెమెరా మెన్ 2 కోట్లకు పలువుర్ని ముంచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నమ్మకంగా ఉంటూ చిట్టీల పేరుతో 2 కోట్ల రూపాయలను వసూలు చేసిన కెమెరా మెన్ బాబా పరారయ్యాడు. 2 కోట్లతో పరారైన కెమెరా మెన్ పై సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.