: సోనియా నోట సీమాంధ్ర మాట
కరీంనగర్ వేదికపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సీమాంధ్రకు న్యాయం చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అన్ని పార్టీలు అడ్డుకున్నా తామే తెలంగాణ ఇచ్చామని చెప్పిన సోనియా గాంధీ, తెలంగాణ ప్రజలను అలరించే భాష మాట్లాడి కొందరు రెచ్చగొడుతుంటారని, వారి పట్ల అప్రమత్తతతో ఉండాలని ఆమె సూచించారు. తెలంగాణ ప్రజలు శత్రుభావం వీడి, సీమాంధ్ర ప్రజలతో సోదర భావంతో మెలగాలని ఆమె హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరి సహకారం కావాలని ఆమె అన్నారు. ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదని ఆమె తెలిపారు.