: హకీంపేట చేరుకున్న సోనియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్, టీ కాంగ్రెస్ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి కాసేపట్లో ఆమె కరీంనగర్ వెళ్లనున్నారు. కరీనంగర్ లో ఈ సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ సభలో సోనియా ప్రసంగించనున్నారు.