: ఏ సీటు అడిగినా బాలకృష్ణకు ఇవ్వాలనుకుంటున్నామన్నారు : నందమూరి హరికృష్ణ
రానున్న ఎన్నికల్లో తనకు టీడీపీ సీటు కేటాయించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీటు కోరలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. పెనమలూరు స్థానాన్ని ఇవ్వాలని చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నప్పుడే అడిగానని... ఆ స్థానాన్ని బాలకృష్ణకు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారన్నారు. అలాగే వీలైతే హిందూపురం శాసనసభ స్థానాన్ని కేటాయించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో అడిగానని... అప్పుడు కూడా హిందూపురంపై బాలకృష్ణ ఆసక్తి చూపుతున్నారని చెప్పారని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేసిన తనకు ఏదో ఒక సీటు కేటాయిస్తారని ఆశించానని ఆవేదన వ్యక్తం చేశారు.