: తణుకులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం


పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తణుకులో రోడ్ షో నిర్వహించిన బాబు మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ తోడు దొంగలేనని, పిల్ల కాంగ్రెస్ కు ఓటేస్తే తల్లి కాంగ్రెసుకు వేసినట్టేనని ఆయన అన్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అనేక సౌకర్యాలను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే రూ. 5 లక్షలు బీమా కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ రోడ్ షోలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News