: కడపలో పోలీసుల చేతికి చిక్కిన ఇద్దరు చైన్ స్నాచర్లు


కడప సీసీఎస్ పోలీసులు ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకున్నారు. ఒంటరిగా నడిచివెళ్తున్న మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను తస్కరిస్తున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 10.20 లక్షల విలువైన 340 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కడప జిల్లా సిద్ధవటం మండలానికి చెందిన శ్రీనివాసులు, శంకరయ్యలు మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులు అపహరించేవారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News