: మీ ఫొటో ఒక పోస్టల్ స్టాంప్!
మీ ఫ్రెండ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఒక లెటర్ పోస్ట్ చేశారు. అది అందుకున్న వెంటనే మీ మిత్రుడు పట్టరాని ఆనందంతో మీకు వెంటనే కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటారా.. మీరు పోస్ట్ చేసిన కవర్ పై అందుకునే మిత్రుడి ఫొటోనే పోస్టల్ స్టాంప్ గా ఉంటుంది మరి. ఇలా మీకు నచ్చిన వారి ఫొటో, లేదా మీ ఫొటోను పోస్టల్ స్టాంప్ గా మార్చి కవర్ పై ముద్రించేదే 'మై స్టాంప్' సేవ. దీనిని కేంద్ర మంత్రి కృపారాణి ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు.
వాస్తవానికి ఈ సేవ గతేడాదే బీహార్ లో అందుబాటులోకి వచ్చింది. నచ్చిన వారి ఫొటోను పోస్టల్ స్టాంప్ తో పాటు పక్కనే స్టిక్కర్ రూపంలో అంటిస్తారు. ఇందుకోసం 100రూపాయలతో నమోదు చేయించుకుని, అదనంగా 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.