: లైంగిక దాడుల నిరోధానికి... రైళ్లలో ‘నిర్భయ’ బృందాలు
రైళ్లలో మహిళలపై లైంగిక దాడుల నిరోధానికి దక్షిణ మధ్య రైల్వే కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘నిర్భయ’ పేరిట ప్రత్యేక సంచార బృందాలను నియమించనుంది. మహిళల నుంచి అందిన సూచనల మేరకు రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్)లోని మహిళా కానిస్టేబుళ్లతో పాటు టికెట్ ఎగ్జామినర్లను కూడా ఈ బృందాల్లో నియమిస్తున్నారు. ఇప్పటికే రంగంలో దిగిన కొన్ని టీమ్స్ 3,400 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి రూ. 10 లక్షల మేర జరిమానా కూడా వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో నిర్భయ బృందాల సంఖ్యను మరింత పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె. శ్రీవాత్సవ హైదరాబాదులో జరుగుతోన్న 59వ రైల్వే వారోత్సవాల్లో ప్రకటించారు. ‘నిర్భయ’ ఏర్పాట్లలో భాగంగా రైళ్ల రాకపోకల సమాచారాన్ని ‘ప్రత్యక్ష పద్ధతి’ (లైవ్ డిస్ ప్లే)లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.