: అనంతపురంలో జేసీ.. పెనుకొండలో రఘువీరా నామినేషన్లు
సీమాంధ్రలో నామినేషన్ల పర్వం వేగం పుంజుకుంది. ఈ నెల 19 చివరి తేదీ కావడంతో పలువురు అభ్యర్థులు తమ స్థానాలకు నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం లోక్ సభ స్థానానికి టీడీపీ తరపున జేసీ దివాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అటు పెనుకొండ నుంచి పోటీ చేస్తున్న సీమాంధ్ర పీీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక నందిగామలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా తంగిరాల ప్రభాకర్ కూడా నామినేషన్ వేశారు. మైలవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా దేవినేని ఉమ నామినేషన్ వేశారు. మరోవైపు గుంటూరు ఎంపీ స్థానం నుంచి గల్లా జయదేవ్, కర్నూలు లోక్ సభ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కర్నూలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా టీజీ వెంకటేష్, కడప వైసీపీ లోక్ సభ అభ్యర్థిగా శ్రీనివాసులు రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.