: అరకు టీడీపీ అభ్యర్థి గెస్ట్ హౌస్ పై దుండగుల దాడి
విశాఖ జిల్లా అరకు టీడీపీ అభ్యర్థి కుంభా రవిబాబు అతిథిగృహంపై కొంతమంది దుండగులు దాడి చేశారు. పెట్రోల్ పోసి అతిథిగృహానికి నిప్పంటించారు. అటు అరకు టీడీపీ కార్యాలయంపైన దాడికి తెగబడ్డారు. అయితే, తివేరి సోమ అనే వ్యక్తిని కాదని రవికి టికెట్ ఇచ్చినందుకే టీడీపీ కార్యకర్తలు ఈ పని చేశారని సమాచారం.