: నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయల్దేరిన బాలకృష్ణ
సినీ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ హిందూపురం చేరుకున్నారు. పట్టణంలోని సుగూరు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. బాలయ్యతో పాటు ఆయన సతీమణి, ఇద్దరు కుమార్తెలు, చిన్న అల్లుడు, కుమారుడు కూడా ఉన్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు ఆయన ర్యాలీగా బయలుదేరారు. ఈ ఉదయం 11.01 గంటలకు బాలకృష్ణ నామినేషన్ వేయనున్నారు.