: చంద్రబాబు తరపున లోకేష్ నామినేషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తరపున కుప్పం శాసనసభ స్థానానికి ఆయన తనయుడు లోకేష్ రేపు (గురువారం ) నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేయడానికి చంద్రబాబే స్వయంగా వస్తారని తొలుత ప్రకటించినా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఆయన తలమునకలై ఉన్నందున లోకేష్ ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు లోకేష్ కుప్పం చేరుకోనున్నారు. లక్ష్మీపురంలోని శ్రీవరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రదర్శనగా బయలుదేరి పట్టణానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున 2009 ఎన్నికల్లోనూ లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు.