: నారాయణమూర్తితో పాటే రోహన్ మూర్తి కూడా... : ఇన్ఫోసిస్ సీఈవో
ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన తండ్రి నారాయణమూర్తికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఇండియాలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీలో అతి తక్కువ అనుభవం ఉన్న రోహన్ అత్యున్నత పదవుల్లో ఒకటైన దానిని చేపట్టడం ఎంతవరకు సమంజసం? అనే చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇన్ఫీ సీఈవో శిబులాల్ స్పందించారు. తాను ఇన్ఫోసిస్ ఛైర్మన్ పదవిని వదిలేసేటప్పుడు రోహన్ కూడా తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పదవిని వదిలేస్తాడని నారాయణమూర్తి చెప్పారని తెలిపాడు.