: కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురి సజీవ దహనం


కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో 20మంది గాయపడగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు దావణగెరె నుంచి బెంగళూరు వెళ్తుండగా అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో చిత్రదుర్గ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అయితే సజీవ దహనమయిన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News