: రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ: కేసీఆర్
నిజామాబాదులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. నిజామాబాదుకి మళ్లీ పూర్వవైభవం రావాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి కవితను గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ట్రాక్టర్లు, ట్రాలీలకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదని ఆయన అన్నారు. నిజాంసాగర్ ఆయకట్టును పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ తోనే నిజామాబాద్ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.