: ఎమ్మెల్సీగా పొంగులేటి ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఇటీవలే ఎంపికైన కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు బాధాకరమన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని ప్రజలపై భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.