: సచివాలయ సమావేశంలో పాల్గొన్న ధర్మాన


వివాదాస్పద జీవోల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావు ఈ రోజు సచివాలయంలో జరిగిన ఎన్ఎసి బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన ఈ ఉన్నతస్థాయి సమీక్షలో ఆయనతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి ఆనం చెబుతూ, ధర్మాన తమ మంత్రవర్గ సహచరుడేనని అన్నారు. రాజీనామా చేసిన ఆరు నెలల తర్వాత ధర్మాన సచివాలయంలో సమావేశానికి హాజరుకావడం ఇదే తొలిసారి !

  • Loading...

More Telugu News