: పోస్టల్ స్టాంపులపై ‘స్వలింగ’ శృంగారం!


పోస్టల్ స్టాంపులపై గే శృంగారమా? అని ఆశ్చర్యపోకండి. భారత్ ఇప్పుడిప్పుడే స్వలింగ సంపర్కులకు సమాన హక్కుల గురించి మాట్లాడుతోంది. కానీ ఫిన్లాండ్ లో పోస్టల్ స్టాంపులపై గే కల్చర్ ను ప్రతిబింబించే బొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ మధ్యే ప్రముఖ గే చిత్రకారుడు టౌకో లాక్సోనెన్ వేసిన చిత్రాలతో ఫిన్లండ్ ప్రభుత్వం స్టాంపులను విడుదల చేసింది.

మగతనం ఉట్టిపడే నాలుగు చిత్రాలతో స్టాంపులు రూపొందించారు. ఈ చిత్రాలను ఇంకో ప్రముఖ చిత్రకారుడు టిమో బెర్రీ ఎంపిక చేశారు. మనలాంటి వాళ్లకు కాస్త కంగారు పుట్టించవచ్చునేమో కానీ, ఈ చిత్రాలు ఫిన్లాండ్ లో మాత్రం భలే సూపర్ హిట్ అయ్యాయి. ఫిన్లండ్ లో సమలైంగిక వివాహాలకు ఆమోదం ఇవ్వాలని 1.66 లక్షల మంది సంతకాలు కూడా చేశారు.

  • Loading...

More Telugu News