: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: కిషన్ రెడ్డి
దేశం అభివృద్ధి చెందాలంటే అది భారతీయ జనతాపార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని యువత మార్పు కోరుకుంటోందని ఆయన అన్నారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వ సహకారం అవసరమని, టీఆర్ఎస్ ను ఓడించడమే బీజేపీ ధ్యేయమని ఆయన అన్నారు.
ప్రజల్లో బీజేపీపై ఉన్న ప్రేమ కంటే... కాంగ్రెస్ పై ఎక్కువ వ్యతిరేకత ఉందని... అదే బీజేపీని గెలిపిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పండుగలను గుర్తిస్తామని, అమరవీరుల కుటుంబాలకు బీజేపీ న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మూడో ఫ్రంట్ ఎండమావి లాంటిదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేస్తారో ప్రజలు ఆలోచించుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.