: ఈఫిల్ టవర్ కు బాంబు బెదిరింపు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈఫిల్ టవర్ దగ్గర బాంబు పెట్టారన్న పుకార్లు అక్కడి అధికారులను పరుగులు తీయించాయి. శనివారం పారిస్ లోని ఈఫిల్ టవర్ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. పర్యాటకులను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత పూర్తిగా శోధించిన తర్వాత బాంబు లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు.