: రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్సేనన్న భావం పోగొట్టాలి: చిరంజీవి
రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అన్న భావనను సీమాంధ్రుల్లో పోగొట్టాలని కేంద్ర మంత్రి చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన కారణంగానే పోలవరం ప్రాజెక్టు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికీ వెళ్లిపోలేదని, నేతలే పార్టీలు మారారని ఆయన చెప్పారు. కార్యకర్తలు ఉండగా పార్టీని బతికించుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన తెలిపారు.