: మన్మోహన్ సింగ్ సూపర్ ప్రధాని: ప్రియాంకగాంధీ
'మన్మోహన్ సింగ్ సూపర్ ప్రధాని' అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధానిపై వచ్చిన ఆరోపణలు నిజమైనవి కావని, ఆయనొక అద్భుతమైన వ్యక్తని అభివర్ణించారు. యూపీఏలో మన్మోహన్ హవా ఏమీ లేదని, అంతా తానై సోనియా చక్కబెడుతుంటారని పీఎం మాజీ సలహాదారు సంజయ్ బారు తాను రాసిన 'ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం ప్రియాంక ఈ విధంగా స్పందించారు.