: మా పని అయిపోలేదు...మా బలం పెరిగింది: రఘువీరా
కాంగ్రెస్ పని అయిపోలేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 175 అసెంబ్లీ స్థానాలకు సీమాంధ్ర నుంచి 1300 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. అందులో సమర్థులను ఎంపిక చేయడానికి చెమటోడ్చామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిలదొక్కుకుని సత్తా చాటుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.