: విజయవాడలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలి ముగ్గురికి గాయాలు
విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఆవరణలోని విద్యుత్ సబ్ స్టేషన్ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ ఫార్మర్ లోకి విద్యుత్తును సరఫరా చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యుత్ శాఖ ఏఈలు బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డితో పాటు ఎల్.ఐ సత్యనారాయణ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ శాఖాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.