: టీఆర్ఎస్ అంటే 'తెలంగాణ రావుల సమితి' పార్టీ : మధుయాష్కీ గౌడ్
తెలంగాణ అంటే కేసీఆర్ ఫాంహౌస్ కాదని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు ఓట్లేస్తే దొరల పాలన వస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ అంటే 'తెలంగాణ రావుల సమితి' అంటూ కొత్త భాష్యం చేప్పారు. ఆ పార్టీ కుటుంబ పార్టీ అని, అక్కడ కుటుంబ సభ్యులకు, బంధువులకు మాత్రమే చోటు ఉంటుందని ఆయన అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకున్నది థర్డ్ ఫ్రంట్ పార్టీలోని నేతలేనని, వారిని నమ్మవద్దని మధుయాష్కీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ అని ఆయన తెలిపారు.