: ప్రధానిని సంజయ్ బారు మోసం చేశారు: మన్మోహన్ కుమార్తె


'ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పేరుతో పీఎం మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనితీరుపై పుస్తకంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై మన్మోహన్ పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానికి బారు ద్రోహం చేశారన్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడుతూ, అతిశయోక్తితో ఆయన (బారు) సొంతంగా తెలిపిన అభిప్రాయాలపై చాలా కోపంగా ఉన్నామన్నారు. తాను పీఎం శ్రేయోభిలాషినంటూ తానుగా బారు చెప్పుకోవడం సరికాదన్నారు. అయితే, అటువంటి ప్రచారం, మాటలతో ఎందుకలా చేశారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News