: సచిన్ కు ఫుట్ బాల్ నేర్పుతా: గంగూలీ


లెజెండరీ క్రికెటర్ సచిన్ కు ఫుట్ బాల్ గురించి ఏమీ తెలియదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ ఆటను సచిన్ కు నేర్పుతానని చెప్పాడు. ఇండియన్ సూపర్ లీగ్ లో కొచ్చి ఫ్రాంచైజీకి సచిన్, కోల్ కతా ఫ్రాంచైజీకి గంగూలీ సహ యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే. 15 ఏళ్లపాటు భారత్ తరపున తాను, సచిన్ కలసి ఆడినప్పటికీ... సూపర్ లీగ్ లో మాత్రం తమ జట్లు ప్రత్యర్థులుగా పోటీ పడతాయని చెప్పాడు. సాకర్ గురించి ఏమీ తెలియని సచిన్ ను తొందరగా ఆటను నేర్చుకోమని చెబుతున్నానని గంగూలీ చెప్పాడు. అన్నట్టు... క్రికెటర్ కాకముందు గంగూలీ సాకర్ ఆడేవాడు.

  • Loading...

More Telugu News