: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ నేతల అరెస్టు
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు దువ్వాడ శ్రీనివాస్, ఆయన సతీమణి దువ్వాడ వాణిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. ఈ నెల 11న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి ఒకటవ ప్రాదేశిక పోలింగ్ కేంద్రం సమీపంలో ఈ దంపతులు పోలీసులతో తీవ్ర ఘర్షణ పడ్డారు. ఆ తదుపరి రోజే టెక్కలి ఎస్సై శంకర్రావు ఫిర్యాదు చేశారు. దాంతో చర్యలు చేపట్టిన సీఐ శ్రీనివాసరావు 353, 506/1, 294బి, 188 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.