: టీడీపీ కార్యకర్తలు, జూ.ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘర్షణ
నల్గొండ టీడీపీలో డోర్ పోస్టర్లు కొత్త సమస్యను సృష్టించాయి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వామిగౌడ్ తన పోస్టర్లలో పవన్ కల్యాణ్ ఫొటో వేశారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. పోస్టర్లలో జూ.ఎన్టీఆర్ ఫొటో ఎందుకు లేదని... వారు పోస్టర్లను చింపి దగ్ధం చేశారు. పోస్టర్లలో చంద్రబాబు ఫొటో ఉందని, అలాంటప్పుడు పోస్టర్లను మీరెలా దగ్ధం చేస్తారంటూ... ఈ వ్యవహారాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, టీడీపీ కార్యకర్తలకు, జూ. ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఘర్షణ తలెత్తింది.