: వైభవంగా కదిరి నరసింహుడి రథోత్సవం
అనంతపురం జిల్లా కదిరిలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం ఈ ఉదయం వైభవంగా జరిగింది. స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత నరసింహుడిని రథంపై ఊరేగించారు. ఆనవాయతీ ప్రకారం ఐదు గ్రామాల ప్రజలు స్వామి రథాన్ని లాగి తరించారు. పట్టణంలోని ప్రజలు అందరూ స్వామి, అమ్మవార్ల దర్శనంతో పులకించిపోయారు. రథోత్సవాన్ని చూసేందుకు కర్ణాటక నుంచి రెండు లక్షల మంది, రాష్ర్టం నుంచి అసంఖ్యాకంగా తరలి వచ్చారు.