: వారణాశిలో రేపటి నుంచి కేజ్రీవాల్ ప్రచారం
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించనున్నారు. మంగళవారం నుంచి కేజ్రీవాల్ అక్కడ పర్యటిస్తారు. ఏఏపీ సీనియర్ నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా ఇప్పటికే ఆ పట్టణానికి చేరుకున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి వారణాశికి రైల్లో రానున్నారు.
ఆ నియోజక వర్గంలో మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 24 ఆఖరు తేదీ. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఈ నెల 28. మోడీ పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గాన్ని ఏఏపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేజ్రీవాల్ విస్తృతంగా వారణాసిలో పర్యటించి ప్రచారాన్ని కొనసాగించనున్నారు.