: తెలంగాణ జేఏసీ అజెండాను అన్ని పార్టీలకు ఇస్తాం: కోదండరాం
తెలంగాణ జేఏసీ అజెండాను అన్ని పార్టీలకు ఇస్తామని రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. టీఎన్జీవో భవన్ లో ఆయన మాట్లాడుతూ, వివిధ పార్టీల మేనిఫెస్టోల్లో అంశాలపై చర్చించామని అన్నారు. ఈ నెల 18న జేఏసీ మరోసారి భేటీ అవుతుందని అన్నారు.