: అజ్ఞాతం వీడిన పేర్ని నాని


ఉన్నట్టుండి మాయమైపోయిన పేర్ని నాని అజ్ఞాతం వీడి, మచిలీపట్నంలో ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికీ పారిపోలేదని... తన ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని... ఇదే విషయాన్ని వైకాపా అధినేత జగన్ కు కూడా స్పష్టం చేశానని తెలిపారు. పేర్ని నానిని మరో వైకాపా నేత కొడాలి నాని బుజ్జగిస్తున్నారు. పేర్ని నానిని మచిలీపట్నం శాసనసభ అభ్యర్థిగా వైకాపా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News